యూనివర్సిటీలు తెచ్చిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డిదే

నవతెలంగాణ-కంటేశ్వర్ : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి చదువుల కోసం యూనివర్సిటీలో తెచ్చిన ఘనత కీర్తిశేషులు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని పిసిసి ప్రధాన కార్యదర్శి గడూ గంగాధర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ భవన్ నందు పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, పీసీసీ ఉపాధ్యక్షులు తహేర్ బిన్ హందాన్  తో కలిసి పత్రిక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గడుగు గంగాధర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజశేఖర్ రెడ్డి  ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిజామాబాద్ జిల్లాలో బడుగు బలహీన వర్గాల విద్యార్థుల చదువు కొరకు తెలంగాణ యూనివర్సిటీ తీసుకురావడం జరిగిందని, దీని ద్వారా ఎంతో మంది తమ విద్యను పూర్తి చేసుకున్నారని ,కానీ ప్రస్తుతం తెలంగాణ యూనివర్సిటీలో రిజిస్టర్ పదవి కోసం యూనివర్సిటీని రెండుగా చీల్చుతూ ఈసీ ఒక రిజిస్టర్ను తెలంగాణ యూనివర్సిటీ విసీ మరొక రిజిస్టర్ను నామినేట్ చేయడం జరుగుతున్న సందర్భంగా అందులో ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థులు రెండుగా చీలిపోయారని, తెలంగాణ యూనివర్సిటీలో ఇంత జరుగుతుంటే సరైన రిక్రూట్మెంట్ లేదని, విద్యార్థులకు సరైన వసతులు లేవని దీనిపైన ఏరోజైనా జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కవిత స్పందించారా అని ఆయన ప్రశ్నించారు. యూనివర్సిటీలో విద్యార్థులకు కావలసిన వసతులు కల్పించాలన్న రిజిస్టర్ సంతకం కావాలని, ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వాలన్న రిజిస్టర్ సంతకం ఉండాలని కానీ యూనివర్సిటీలో రిజిస్టర్ లేనప్పుడు ఇవన్నీ ఎలా జరుగుతాయని, కావున వెంటనే తెలంగాణ యూనివర్సిటీలో రిజిస్టర్ను నియమించి బడుగు బలహీన విద్యార్థుల చదువులకు తోడ్పడాలని ఆయన అన్నారు. మరో ప్రక్క జిల్లాలో కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు రిటైర్ అయి రెండు నెలలు అయినా ఇప్పటివరకు జిల్లాకు సిపిని నియమించలేదని గతంలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదని ,మంత్రికి మరియు ఎమ్మెల్సీ కవిత గారికి పొంతన కుదరక పోవడం వల్లనే జిల్లాకు సిపిని నియమించడం లేదని ఆయన అన్నారు. జిల్లాకు సిపి లేకపోవడం వల్ల శాంతిభద్రతలు భంగం వాటిల్లుతుందని వెంటనే సిపిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో  నగర కాంగ్రెస్ అద్యక్షులు కేశ వేణు,జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ జావేద్ అక్రమ్, ఓ బి సి చైర్మన్ రాజ నరేందర్,ఉబెడ్ బిన్ హాందాన్, ఎజాజ్, అజీజ్ అన్సారీ,ఈసా,రేవతి,మలైకా బేగం పద్మ తదితరులు పాల్గొన్నారు.
Spread the love