నవతెలంగాణ – హైదరాబాద్ : వైఎస్సార్సీపీ అధిష్టానం త్వరలో జరగబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. శనివారం ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ప్రకటన వెలువడింది. 175 మంది ఎమ్మెల్యే, 25 ఎంపీ అభ్యర్థుల జాబితాల్ని చదివి వినిపిస్తున్నారు ధర్మాన, ఎంపీ నందిగమ సురేష్. మొత్తం అభ్యర్థుల్లో 50 శాతం అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉండడం గమనార్హం. 25 ఎంపీ స్థానాల్లో బీసీలకు 11 ఎంపీ, ఓసీ 9, ఎస్సీలకు 4 ఎంపీ స్థానాలు, ఎస్టీలకు 1 ఎంపీ సీట్లు ప్రకటించారు. మొత్తంగా గతంలో కంటే ఎక్కువ సీట్లు ఇచ్చినట్లు ధర్మాన ప్రకటించారు. అందరూ ఊహించిన విధంగానే అభ్యర్థులను ఫిల్టర్ చేసి, గెలుపు గుర్రాలను అనౌన్స్ చేశారు. మరోసారి పులివెందుల నుంచే సీఎం జగన్ బరిలోకి దిగనున్నారు.