– షర్మిల బహిరంగ లేఖ
అమరావతి : ఆస్తుల పంపకం విషయంలో జగన్.. తల్లి విజయమ్మను, తనను మోసం చేశారని పిసిసి అధ్యక్షులు షర్మిల పేర్కొన్నారు. శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన తండ్రి వైఎస్‌ఆర్ ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఆస్తి కావాలంటే జగన్, భారతి, అవినాష్‌రెడ్డి గురించి మాట్లాడొద్దని షరతు పెట్టారని తెలిపారు. దీనికి మనసు అంగీకరించక తాను ఒప్పుకోలేదని అన్నారు. దీంతో జగన్ కోర్టును ఆశ్రయించారని తెలిపారు. తనకు రూ.200 కోట్లు ఇచ్చారని, అవి కంపెనీలో డివిడెండ్ అని పేర్కొన్నారు. కేసులు లేని ఆస్తులనే పంచారని, ఈ వివాదం వల్ల బెయిల్ రద్దవుతుందనేది తప్పుడు ప్రచారమని పేర్కొన్నారు. తనను, తల్లి విజయమ్మను ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా వేధింపులకు గురిచేశారని వివరించారు. తన వారసులు నలుగురికి ఆస్తులు సమానంగా పంచాలంటే పంచకుండా ఏకపక్షంగా వ్యవహరించారని, పైగా వాటాల్లో 30 శాతం తనకు అదనంగా కావాలని ఆంక్ష పెట్టారని పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ ఏదైతే నలుగురు పిల్లలకు సమానంగా వాటా రావాలని కోరుకున్నారో దానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ పైగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.