నవతెలంగాణ- జఫర్ గడ్ ,వరంగల్
జఫర్ గడ్ ఎస్. ఐ ఎస్. రవి సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కొద్ది సేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. గత సంవత్సరం జఫర్ గడ్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో అలసత్వంతో వ్యవహరిస్తూ, కేసు విచారణ పోలీస్ ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తూ, బాధితులకు న్యాయం చేయకుండా నిందితులకు సహకరిస్తూ, తప్పడు పత్రాలను సృష్టిస్తున్నట్లుగా ఫిర్యాదు రావడంతో పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు విచారణ జరిపిన అధికారులు ఎస్.ఐ అవకతవకలకు పాల్పడినట్లుగా నిర్ధారణ కావడంతో జఫర్ గడ్ ఎస్. ఐ ఎస్. రవిని సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.