అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎట్టకేలకు పార్టీ అధిష్టానం జారే ఆదినారాయణ ను ఖరారు చేసింది. ఈ నియోజక వర్గానికి ఈ పార్టీ నుండి మొత్తం ఎనిమిది మంది దరఖాస్తు చేసుకున్నారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా జారే ఆదినారాయణ, రేణుకా చౌదరి మద్దతు దారుగా తాటి వెంకటేశ్వర్లు, మల్లు బట్టి విక్రమార్క అనుయాయులు గా సున్నం నాగమణి లు ఈ ముగ్గురి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరకి పొంగులేటి వర్గానికే సీటు ఖరారు చేసారు.
పేరు: జారే ఆదినారాయణ
తండ్రి: సత్యనారాయణ
కులం కోయ(ఎస్టీ)
పుట్టిన తేదీ: 08/07/1983
వయసు 40 సంవత్సరాలు
వృత్తి వ్యవసాయం
స్వగ్రామం/నివాసం: గండుగులపల్లి గ్రామం, దమ్మపేట మండలం
విద్యార్హత: ఎమ్మెస్సీ(మాథ్స్), బీపీఈడీ
అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడుగా పనిచేసి రాజీనామా చేశారు.
2014లో టీఆర్ఎస్ తరుపున అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమికి గురయ్యారు.
2018లో టీఆర్ఎస్ టికెట్ ఆశించినా దక్కలేదు.