ఇందిరమ్మ ఇండ్ల సర్వే పారదర్శకంగా చేయాలి: జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి

Indiramma house survey should be made transparent: ZP CEO Nagalakshmiనవతెలంగాణ – అశ్వారావుపేట
ఇందిరమ్మ గృహ సర్వే పారదర్శకంగా చేపట్టాలని జెడ్పీ సీఈవో నాగ లక్ష్మీ స్థానిక అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన అంశాల వారీగా వివరాలు నమోదు చేయాలని చెప్పారు. మండలంలోని నారంవారిగూడెం లో జరుగుతున్న ఇందిరమ్మ సర్వే ను శుక్రవారం అమే పర్యవేక్షించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా దరఖాస్తుదారుల పూర్తి వివరాలు సేకరించాలని, ఇందిరమ్మ యాప్ లోని వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేశారు.సర్వే పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహించ రాదని హితవు పలికారు.అక్కడ నుండి గ్రామంలోని ప్రభుత్వ ప్రాదమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో భోధన,సౌకర్యాలు,మధ్యాహ్నం భోజనం నాణ్యతను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ అమలుపై ఆరా తీశారు. ఇంతలో అక్కడకు వచ్చిన గ్రామస్తులతో ఆమె ముచ్చటించారు.ప్రభుత్వ పాఠశాలల్లో సర్కార్ అన్ని మా సదుపాయాలు కల్పిస్తుందని, పిల్లలకు మంచి విద్యను అందిస్తే అదే వారి భవిష్యత్ లో శాశ్వత ఆస్తి అవుతుందని వివరించారు.పిల్లల బంగారు భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా చదివించాలని సూచించారు. అనంతరం పట్టణంలోని మూడు రోడ్ల ప్రధాన కూడలి లో గల మండల పరిషత్ పూర్వ కార్యాలయ స్థలాన్ని ఆమె సందర్శించారు.వాటి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.స్థలం అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని, ఏమైనా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించారా..? అని ప్రశ్నించారు. పాలకవర్గం లేకపోవటం వల్ల ఎటువంటి ప్రణాళికలు చేపట్టలేదని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ సమాధానం ఇచ్చారు. ఆనంతరం మండల పరిషత్ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.ఆమె వెంట ఎంపీఈవో ప్రసాదరావు, సిబ్బంది ఉన్నారు.
Spread the love