ఒకేఇంట్లో ఇద్దరికి జికా వైరస్..

నవతెలంగాణ – హైదరాబాద్: మహారాష్ట్రలోని ఫుణె సిటీలో జికా వైరస్ కలకలం రేపింది. ఓ డాక్టర్ తో పాటు ఆయన కూతురు ఈ వైరస్ కు పాజిటివ్ గా తేలారు. అయితే, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు.  జూన్ 21న ఆయన జికా వైరస్ కు పాజిటివ్ గా తేలారు. దీంతో ఫుణె మెడికల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే అప్రమత్తమై అతడి కుటుంబ సభ్యుల బ్లడ్ శాంపిల్స్​ను కలెక్ట్ చేసి పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే అతడి 15 ఏండ్ల కూతురికి కూడా వైరస్ నిర్ధారణ అయింది. ఒకే ఇంట్లో రెండు కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Spread the love