అనారోగ్య బాధితునికి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆర్థిక సహకారం 

నవతెలంగాణ – సిద్దిపేట
జోగిపేట పట్టణానికి చెందిన నిరుపేద వైశ్యుడు కొడిప్యాక నాగరాజు  రక్త కణాల సమస్యతో మందులకు, తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విషయం తెలుసుకొని జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో వైశ్య నాయకుల సహకారంతో రూ 17,000 ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని  రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి గంప శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయిత రత్నాకర్ తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ   జిల్లా లో నిరుపేద ఆర్యవైశ్యులకు సహకారం అందించడమే కాకుండా, వైశ్యేతురులకు సైతం వివిధ రకాల సేవలు జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషకరం అన్నారు.   జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో సమాజంలో ఉన్న నిరు పేద వదవులకు పుస్తె  మట్టెలు అందించడం జరిగిందని, ఈ మధ్యనే నంగునూరు మండలం నర్మేట గ్రామానికి చెందిన పేద వృద్ధ మహిళ కాలు విరిగి  ఆర్థిక సమస్యలతో ఉన్నదని,  కోహేడ మండలంలోని  విష్ణు కు బ్రేన్ ట్యూమర్ తో ఇబ్బంది పడుతున్నరని,    పోతరెడ్డిపేటకు చెందిన కిడ్నీ బాదితుడు కాశినాథ్ కు, గుర్రాలగొంది కి చెందిన కిడ్నీ బాధితులు బాల్ లింగం కు ఆర్థిక  సహకారం అందించినట్లు తెలిపారు.  చేర్యాల లో పేద ఆర్యవైశ్య కుటుంబాలకు స్వయం ఉపాధి క్రింద కుట్టు మిషన్లు, వెట్ గ్రైండర్, ఫ్లోర్ మిల్లు అందించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో  జిల్లా మహాసభ కోశాధికారి అత్తెల్లి లక్ష్మయ్య, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మాడిశెట్టి హేమలత, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పుల్లూరి శివకుమార్ , జిల్లా మహిళా విభాగం కోశాధికారి మార్యాల వాణి, జిల్లా కార్యదర్శి తడకమడ్ల శంకరయ్య , గజ్వేల్ మండల అధ్యక్షులు మర్మాముల ఓంకార్ , జిల్లా వాసవి సేవాదల్ కోశాధికారి చింత రాజేంద్ర ప్రసాద్, సిద్దిపేట డివిజన్ చైర్మన్ గంప కృష్ణమూర్తి, జిల్లా వాసవి సేవాదళ్ కార్యదర్శి మార్యాల వీరేశం, వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు  తొడుపునూరి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
Spread the love