జింబాబ్వే లెజెండ్ క్రికెటర్ కన్నుమూత

నవతెలంగాణ – హైదరాబాద్: జింబాబ్వే దిగ్గజ ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయ‌న దక్షిణాఫ్రికాలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ విష‌యాన్ని హీత్ స్ట్రీక్ భార్య నదినే స్ట్రీక్ సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించింది. ”ఈ రోజు తెల్లవారుజామున నా జీవితంలో గొప్ప ప్రేమికుడు.. నా అందమైన పిల్లల తండ్రి, తన ఇంటి నుండి దేవదూతలతో వెళ్లాడు. అక్కడ అతను తన చివరి రోజులను గడపాలని కోరుకున్నాడు” అంటూ నదినే స్టీక్ సోష‌ల్ మీడియాలో రాసుకోచ్చింది. హీత్ స్ట్రీక్ 1993లో జింబాబ్వే క్రికెట్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. 12 ఏళ్ల పాటు సాగిన త‌న క్రికెట్ కెరీర్‌లో 65 టెస్టులు, 189 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 216 వికెట్లు, వన్డేల్లో 239 వికెట్లు పడగొట్టాడు. కాగా జింబాబ్వే తరఫున అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఇప్ప‌టికి కుడా హీత్ స్ట్రీక్ పేరిటే ఉంది. అలాగే జింబాబ్వే తరఫున టెస్టులు, వన్డేల్లో తొలి 100 వికెట్లు తీసిన బౌలర్ కూడా హీత్ స్ట్రీక్ రికార్డు సృష్టించాడు.

Spread the love