నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని సుమారు 17 వేల మంది వీఆర్‌ఏలకు ప్రభుత్వం జూనియర్ అసిస్టెంట్స్ హౌదా ఇవ్వాలన్న జీవో 81ని రద్దు చేయాలని కోరుతూ రెవెన్యూ శాఖలోని ఆఫీస్ అసిస్టెంట్లు హైకోర్టులో రిట్లు దాఖలు చేశారు. ఆదిత్య ,ఇతర ఆఫీస్ అసిస్టెంట్లు వేసిన ఈ రిట్‌ను గురువారం హైకోర్టు విచారించనుంది. వీఆర్‌ఏలకు ఇస్తే అభ్యంతరం లేదనీ, అయితే, చట్ట ప్రకారం ఆఫీస్ అసిస్టెంట్లకు ఇచ్చాకే ఇవ్వాలనీ, ప్రభుత్వ నిర్ణయం స్టేట్ మినిస్టీరియల్ సర్వీస్ రూల్స్, స్టేట్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్లకు వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు.