మృతదేహానికి నివాళ్ళర్పించిన జడ్పీ చైర్మన్..

– ములుగు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి

నవతెలంగాణ – తాడ్వాయి 

ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన కుడుముల శేషగిరి,  కుమారుడైన కుడుముల విష్ణు ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, విషయం తెలుసుకున్న ములుగు జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. చనిపోయిన కుటుంబానికి  ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె వెంట బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు ఉన్నారు.
Spread the love