విద్యార్థులకు పరీక్ష ప్యాడ్, పెన్నులను అందజేసిన జెడ్పీటీసీ

నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలంలోని ఆదర్శ పాఠశాల, రెంజల్ జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి నీ విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులను, అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో, అంకితభావంతో చదివి తమ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మండలానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థినీ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి ర్యాంకులు తీసుకురావాలని ఆమె విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ బలరాం, రెంజల్ జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, ఆదర్శ పాఠశాల ఎస్ఎంసి కమిటీ చైర్మన్ ఎం నాగరాజ్, ఉపాధ్యాయులు చెన్నప్ప, జ్యోతి, సుష్మ, వ్యాయామ ఉపాధ్యాయులు కృష్ణమూర్తి, ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love