మృతురాలి కుటుంబానికి జడ్పిటిసి ఆర్థిక సహాయం

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల కేంద్రంలో బుధవారం పదోవ వార్డులో ఇల్లందుల వెంకటమ్మ వయసు 65 సంవత్సరాలు అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న గోవిందరావుపేట మండలం జెడ్పిటిసి తుమ్మల హరిబాబు మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి మరణించిన కుటుంబ సభ్యులకు తన తరఫున 3000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యుడు ఎం డి బాబర్ మొనగాల వెంకన్న ఎండి ఫక్రుద్దీన్ తుమ్మల శివ గూడ వంశి జన్యు కరుణాకర్ మునగాల కరుణాకర్ రాజు ఈశ్వర్ గురువయ్య తదితరులు పాల్గొన్నారు. జాలిపర్తి రామారావు మండల ప్రచార కార్యదర్శి బీఆర్ఎస్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love