మృతుని కుటుంబానికి జడ్పిటిసి హరిబాబు ఆర్థిక సహాయం..

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని చల్వాయి గ్రామం గౌరారం గడ్డకి చెందిన గజ్జల రవి 45 సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతిచెందారు. మృతుని వార్త తెలుసుకున్న జడ్పిటిసి తుమ్మల హరిబాబు రవి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం రవి కుటుంబ సభ్యులకు మూడు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. రవి కుటుంబానికి ఎల్లవేళలా బిఆర్ఎస్ పార్టీ అండగా ఉండి ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు శ్రీనివాసరావు, కంకణాల కనకయ్య, బొల్లం శివ,తుమ్మల శివ, మునిగల వెంకన్న, కిర్తి రవి, జన్ను కరుణాకర్ తదితరులు ఉన్నారు.
Spread the love