కోటక్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో జూరిచ్‌ ఇన్సూరెన్స్‌కు మెజారిటీ వాటా

ముంబయి : తమ కోటక్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో స్విట్జర్లాండ్‌కు చెందిన జూరిచ్‌ ఇన్సూరెన్స్‌ 51 శాతం వాటా కొనుగోలు చేయనుందని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వెల్లడించింది. ఈ కొనుగోలు ఒప్పంద విలువ రూ.4,051 కోట్లుగా ఉందని పేర్కొంది. కంపెనీ విస్తరణ కోసం కొత్తగా మూలధనాన్ని అందించడంతో పాటు షేర్ల కొనుగోలు రూపంలో జూరిచ్‌ ఇన్సూరెన్స్‌ ఈ కొనుగోలును పూర్తి చేయనుందని తెలిపింది. రాబోయే మూడేళ్లలో మరో 19 శాతం వాటాను కూడా కొనుగోలు చేసేలా ఒప్పందం కుదిరిందని పేర్కొంది. ఈ డీల్‌కు ఆర్‌బీఐ, ఐఆర్‌డీఏఐ, సిసిఐల నుంచి అనుమతులు లభించాల్సి ఉంటుంది.

Spread the love