Saturday, June 13, 2026
E-PAPER
Homeజాతీయంవెంటిలేటర్‌‌పై నిఫా బాధితుడికి చికిత్స పర్యవేక్షణలో మరో 77 మంది

వెంటిలేటర్‌‌పై నిఫా బాధితుడికి చికిత్స పర్యవేక్షణలో మరో 77 మంది

- Advertisement -

కొజికోడ్‌ : కేరళలోని రమణత్తుకుర లో బయటపడిన నిఫా కేసులో బాధితుడు (43) ఆరోగ్యం విషమంగానే వుంది. ప్రస్తుతం వెంటిలేటర్‌ ‌సాయంతో ఆయనకు ఇక్కడి ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆ రోగిని ఇటీవల కలిసిన మరో 77మందిని ఆరోగ్య శాఖాధికారులు గుర్తించి, వారెక్కడున్నారో కనుగొన్నారు. వీరిలో కుటుంబ సభ్యులు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, స్నేహితులు, సహచరులు వున్నారు. మొత్తంగా 58మంది హెల్త్‌ ‌కేర్‌ ‌వర్కర్లు కాగా, 14మంది కుటుంబ సభ్యులున్నారు. ఐదుగురు స్నేహితులు, కొలీగ్స్‌ ‌వున్నారు. ముప్పు అత్యంత ఎక్కువగా వున్న వారిని క్వారంటైన్‌‌లో వుంచారు. వారి లక్షణాలను నిరంతరంగా పరిశీలిస్తున్నారు. అయితే ఎవరికీ ఇప్పటివరకు ఎలాంటి లక్షణాలు లేవని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. జిల్లాలోని వివిధ ఆరోగ్య సంరక్షణ కేంద్రాల వద్ద ఇన్ఫెక్షన్‌‌ను నిరోధించే రక్షణ యంత్రాంగాలను బలోపేతం చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజలెవరూ భయాందోళనలకు గురవాల్సిన అవసరం లేదన్నారు. అయితే అప్రమత్తంగా వుండాలని కోరారు. రమణత్తుకుర మున్సిపాలిటీలో కలెక్టర్ జోక్యంతో వెంటనే క్షేత్ర స్థాయిలో పలు వ్యాధి నిరోధక చర్యలు చేపట్టారు. సత్వర ప్రతిస్పందన బృందాలను రంగంలోకి దింపారు. కలెక్టర్‌ అభ్యర్ధన మేరకు కంట్రోల్‌ ‌రూమ్‌‌ను ఏర్పాటు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -