Friday, June 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాగ్ అంబర్ పేట వెల్ఫేర్ సొసైటీ కి 900 గజాల ఖాళీ స్థలం కేటాయింపు

బాగ్ అంబర్ పేట వెల్ఫేర్ సొసైటీ కి 900 గజాల ఖాళీ స్థలం కేటాయింపు

- Advertisement -

నవతెలంగాణ-అంబర్‌పేట : బాగ్ అంబర్‌పేట వెల్ఫేర్ సొసైటీ (నందనవనం కాలనీ)కి 900 గజాల ఖాళీ స్థలాన్ని జిహెచ్ఎంసి గురువారం కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు సర్కిల్ డిసి మారుతి దివాకర్ డి ఈ ప్రవీణులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. అక్కడ కమ్యూనిటీ హాల్ కట్టేందుకు కాలనీవాసులు నిర్ణయించారు. ఫెన్సింగ్ ఏర్పాటు పనులకు విహెచ్ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అంబర్‌పేట ఇన్స్పెక్టర్ టి. కిరణ్ కుమార్, మాజీ కార్పొరేటర్ పి.నారాయణస్వామి, టిపిసిసి మాజీ కార్యదర్శి చెంబుల శ్రీకాంత్ గౌడ్, కాలనీవాసులు వి. లక్ష్మీపతి, పి. గిరీధర్ గౌడ్, నక్క ప్రదీప్ గౌడ్, వి. హేమంత్ కుమార్, అరుణ, పాక దేవేందర్, విజయ రెడ్డి, సయ్యద్ ఇబ్రహీం, రావుల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -