- Advertisement -
తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ..
ఎస్సై సద్దాం హుస్సేన్
నవతెలంగాణ – అచ్చంపేట
పట్టణంలోని లింగాల చౌరస్తాలో మైనర్ బాలుడు ముగ్గురిని ఎక్కించుకొని బైక్ డ్రైవింగ్ చేస్తుండగా ఎస్సై సద్దాం హుస్సేన్ పట్టుకున్నారు. బైకును మైనర్ పిల్లలను స్టేషన్ కు తీసుకెళ్లారు. తల్లిదండ్రు లను స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లు బైకులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. బైకు నడిపిన మైనర్ ఇరగోటి శివకుమార్‌కు రూ.3,000 జరిమానా విధించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టవిరుద్ధం తల్లిదండ్రులపైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ద్విచక్రవాహనంపై ముగ్గురు, నలుగురు ప్రయాణించడం చాలా ప్రమాదకరం అన్నారు.
- Advertisement -



