Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: ఎంపీడీఓ

ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – బల్మూరు
మూడో ఫేజ్ గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీవో రాఘవులు అన్నారు. మంగళవారం ఎన్నికల అధికారులకు ఎన్నికల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల మూడవ దశకు సంబంధించి స్టేజ్ 1, ఆర్‌ఓ, ఎఆర్‌ఓలకు నామినేషన్‌కు సంబంధించిన మెటీరియల్ అందించడం జరిగిందని తెలిపారు. నామినేషన్ గురించి అవగాహన కల్పించామని అన్నారు.  మండలంలో మొత్తం 208 పోలింగ్ కేంద్రాలు, ఏడు నామినేషన్ క్లస్టర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొత్తం ఓటర్లు 34, 802 ఉన్నారని ఏడు పోలింగ్ రూట్స్ ఉన్నాయని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో తహశీల్దార్, శ్రీకాంత్, ఎంపిఓలు, జిపిఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఆర్‌ఓలు, ఎఆర్‌ఓలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -