- Advertisement -
నవతెలంగాణ – బొమ్మల రామారం
బొమ్మలరామారం మండలం చౌదర్ పల్లి గ్రామం నుండి మంగళవారం అయ్యప్ప దీక్షా స్వాములు శబరిమలై యాత్రకు బయలుదేరి వెళ్లారు. 41 రోజుల పాటు దీక్షా కాలం ముగించుకుని గురుస్వాములచే ఇరుముడి కట్టుకుని స్వామియే శరణమయ్యప్ప నామస్మరణ చేస్తూ ముందుకు సాగారు. అయ్యప్ప స్వాములు శబరిమలై వెళ్తున్న సమాచారం తెలుసుకున్న బంధువులు, మిత్రులు అధిక సంఖ్యలో హాజరై అయ్యప్ప స్వాముల ఆశీర్వాదాన్ని పొందారు.
- Advertisement -



