నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామ ప్రజల సేవ కోసం గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ ఆ గ్రామానికి చెందిన వసెట్టి నాగనాథ్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. తనకు ఎలాంటి ఆశలు లేవని ప్రజా సేవ చేయాలని ఉద్దేశంతో సర్పంచ్ ఎన్నికల్లో ఏ పార్టీకి అనుకూలం కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు. నా కుటుంబం అన్ని విధాలుగా దేవుడి దయవలన ఆనందంగా ఉన్నామని ప్రజాసేవయే మాధవ సేవగా ప్రజలు సర్పంచ్ గా గెలిపిస్తే ఎలాంటి ఆశ లేకుండా గ్రామ అభివృద్ధికి పాటుపడడంతో పాటు ప్రజలకు ఎలాంటి సేవలైన చేయాలనే ఉద్దేశంతోనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు.
ప్రజాసేవ కోసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా: వశెట్టి నాగనాథ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



