Tuesday, December 2, 2025
E-PAPER
Homeజిల్లాలుథర్డ్ ఫేజ్ నామినేషన్ స్వీకరణకు ఏర్పాట్ల పూర్తి: కలెక్టర్

థర్డ్ ఫేజ్ నామినేషన్ స్వీకరణకు ఏర్పాట్ల పూర్తి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరిగే మూడవ విడత నామినేషన్ స్వీకరణ ప్రక్రియకు  ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ నెల 3వ తేదీ నుండి  5వ తేదీ వరకు చౌటుప్పల్, నారాయణపూర్, అడ్డగూడూర్, మోత్కూర్, గుండాల, మోటకొండూర్   మండలాలకు సంబంధించి 124 గ్రామపంచాయతీలు, 1086 వార్డులకు జరిగే మూడవ విడత నామినేషన్ ప్రక్రియ కి సంబందించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది.

5 గంటలకు నామినేషన్ కేంద్రం గేటు మూసివేయాలని, నామినేషన్ కేంద్రంలో ఉన్న అభ్యర్థుల నుండి మాత్రమే నామినేషన్లు స్వీకరించాలని, ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి ప్రక్రియ ను త్వరగా పూర్తి చేసేలా   అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఎన్నికల నిర్వహణ లో అలసత్వం వహించే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.  నామినేషన్ కేంద్రం నుండి 100 మీటర్ల పరిధిలో గుంపులుగా ఎవరిని అనుమతించరని.. నామినేషన్ సమర్పించే అభ్యర్థులు, ప్రతిపాదించే వారికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.

నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల సంఘం జారీ చేసిన నియమాలకు లోబడి వ్యవహరించాలని, నామినేషన్ పత్రాల స్వీకరణ, నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల ప్రకటన, గుర్తుల కేటాయింపు ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు కలెక్టర్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -