Wednesday, December 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయండ్రోన్‌ మాన్యు ఫాక్చరింగ్‌ కారిడార్‌కు ప్రణాళికలు

డ్రోన్‌ మాన్యు ఫాక్చరింగ్‌ కారిడార్‌కు ప్రణాళికలు

- Advertisement -

– రాష్ట్రాన్ని డిఫెన్స్‌ స్ట్రాటజిక్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం
– మహేశ్వరంలో జేఎస్‌డబ్ల్యూ యూఏవీ ఫెసిలిటీ కేంద్రానికి శంకుస్థాపన
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

రాష్ట్రంలో డ్రోన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, టెస్టింగ్‌ కారిడార్‌ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణను డిఫెన్స్‌ స్ట్రాటజిక్‌ హబ్‌ ఆఫ్‌ ఇండియాగా తీర్చిదిద్దడమే లక్ష్యమనీ, ఆ మేరకే భవిష్యత్‌ ప్రణాళికలు ఉంటాయని స్పష్టం చేశారు. మంగళవారం మహేశ్వరంలో రూ.850 కోట్లతో ఏర్పాటవుతున్న ‘జేఎస్‌ డబ్ల్యూ యూఏవీ ఫెసిలిటీ’ కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పరిశ్రమ ద్వారా ఏటా 300 వరకు వీబీఏటీ డ్రోన్ల ఉత్పత్తి జరుగుతుందనీ, కొత్తగా 300 మందికి ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. డ్రోన్లు, శాటిలైట్లు, సైబర్‌ సిస్టమ్స్‌, ఏఐ అనేవి ఇకపై భవిష్యత్‌ సాంకేతికతలు కావనీ, అవి ఇప్పటికే ఆధునిక యుద్ధాల నిర్వహణ వ్యవస్థగా మారాయని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డ్రోన్ల తయారీలో స్వయం సమృద్ధిని సాధించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమన్నారు. 2030 నాటికి దేశీయ డిఫెన్స్‌ యూఏవీ, డ్రోన్‌ మార్కెట్‌ వాల్యూ 4.4 బిలియన్‌ డాలర్లు, 5 బిలియన్‌ డాలర్లకు పెరిగే అవకాశముందన్నారు. ఎల్బిట్‌ సిస్టమ్స్‌, షీబెల్‌ లాంటి అంతర్జాతీయ డిఫెన్స్‌ దిగ్గజ సంస్థల తయారీ కేంద్రాలు హైదరాబాద్‌లో ఉండటం గర్వకారణమని చెప్పారు. కార్యక్రమంలో జేఎస్‌ డబ్ల్యూ డిఫెన్స్‌ ఫౌండర్‌ పార్థ్‌ జిందాల్‌, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -