నవతెలంగాణ-హైదరాబాద్: వంటనూనెల ప్యాకింగ్ తయారీలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ‘లీగల్ మెట్రాలజీ’ ఫ్రేమ్‌వర్క్ కింద పేర్కొన్న సైజ్‌లలోనే వంటనూనెల ప్యాకింగ్ ఉండాలని ఆదేశించింది. తయారీదారులు ఈ కొత్త నిబంధనలను పాటించడానికి 3 నెలల గడువు ఇచ్చారు. కంపెనీలు అనుకుంటే తక్షణమే వీటిని అమలు చేయొచ్చు. ఇకపై పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్, ఆవాల నూనె, వేరుశనగ, నువ్వులు, రైస్ బ్రాన్, కాటన్‌సీడ్, కార్న్ ఆయిల్, బ్లెండెడ్ వంటనూనెలను 9 సైజులలో మాత్రమే ప్యాక్ చేయాలి. ఇవి 200 ఎంఎల్/జీ, 500 ఎంఎల్/జీ, 1 లీటరు/కేజీ, 2 లీటర్లు/కేజీ, 3 లీటర్లు/కేజీ, 4 లీటర్లు/కేజీ, 5 లీటర్లు/కేజీ, 15 లీటర్లు/కేజీ, 20 లీటర్లు/కేజీ ప్యాకుల్లో వస్తాయి.
వంటనూనెల ప్యాకింగ్ తయారీలో కేంద్రం కీలక నిర్ణయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



