- Advertisement -
- భయబ్రాంతులకు గురవుతున్న ఆరోగ్య కేంద్రం సిబ్బంది
- నవతెలంగాణ-బెజ్జంకి
- మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రానికి విద్యుత్ సరఫరా చేసే తీగలు ప్రమాదకరంగా మారాయి. ఈ క్రమంలో మంగళవారం ఆరోగ్య కేంద్రాన్ని నవతెలంగాణ సందర్శించగా.. భూమికి కొంత మేర ఎత్తులో విద్యుత్ తీగలు వెలాడుతూ కనిపించాయి. ఈ సమస్యపై వైద్యురాలు మాధురిని ఆరా తీయగా ఆమె వెంటనే స్పందించారు. ఇక్కడ ఎన్నో నెలలుగా ఈ సమస్య ఉందని మాధురి తెలిపారు. ఇక్కడ పనిచేసే సిబ్బంది కూడా కరెంటు తీగలను చూసి భయభ్రాంతులకు గురువుతున్నారని వెల్లడించారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు, స్థానిక సర్పంచ్ ప్రత్యేక చోరవ చూపి విద్యుత్ స్తంభం ఏర్పాటుచేసి విద్యుత్ సమస్యకు పరిష్కరించాలని వైద్యురాలు కోరారు.
- Advertisement -



