Tuesday, April 28, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపెట్రోల్ బంకుల్లో బారులుతీరిన జనం

పెట్రోల్ బంకుల్లో బారులుతీరిన జనం

- Advertisement -
  • పెట్రోల్ లేక ఇబ్బందులు
    – బంకుల యజమానులు సిండికేట్
    – ఎక్కువ ధరకు బ్లాక్ లో అమ్మకాలు
    – బ్లాక్ లో రూ.150-160 వరకు ధర
  • నవతెలంగాణ – పెద్దవూర
    పెద్దవూర లో పెట్రోల్ పంపుల్లో పెట్రోల్ లేక ప్రయాణికులు, వాహనదారులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం నుంచి  తీవ్ర పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. చాలా బంకుల్లో  నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ దొరుకదన్న భయంతో వాహనదారులు బంకుల దగ్గర క్యూ కడుతున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాలలో బంకు యజమానులే కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో విక్రయిస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. బ్లాక్ లో లీటర్ పెట్రోల్ 150 నుంచి తీసు కుంటున్నట్లు వినియోగ దారులు ఆరోపిస్తున్నారు. పెద్దవూర మండలం లో ఐదు పెట్రోల్ బంకులు వున్నాయి. వీరంతా సిండికెట్ అయి నోస్టాక్ బోర్డు పెట్టి గుట్ట చప్పుడు కాకుండా క్యాన్ల లో బ్లాక్ లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నట్లు సమాచారం.
  • దీంతో బ్లాక్ పెట్రోల్ ఉంటే బంకుల్లో ఇందుకు ఉండదు. మండలం లో ఐదు బంకుల్లో ఒకే సారీ ఎందుకు అయిపోతుందని వినియోగదారులు మండి పడుతున్నారు. ఉదయం పెద్దవూర మండల కేంద్రం లోని మూడు పెట్రోలు బంకుల్లో పెట్రోల్ లేకప్రజలు ఇంట్లో నుంచి బయటికి కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. హాలియా నుంచి కొంతమంది రాత్రి వేళల్లో పెద్ద వూర పెట్రోల్ బంకులనుంచి రూ.13 లకు క్యాన్ల లో తీసుకెళ్ళు తున్నారని సమాచారం. ఎండలు మండుతుంటే కార్లు బయటికి తీయాలంటే ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. ఎదో ఒక బంకులో పెట్రోల్ ఉంటే అక్కడ గంటల తరబడి వేచి ఉండాల్సిందే. కొందరు ప్రయాణికు లు పనులు మానుకొని ఇండ్లకు పరిమితమయ్యారు. ఏదై నా పెట్రోల్ బ్యాంకులో పెట్రోల్ ఉంటే అక్కడ పోలీసుల ను పెట్టి పెట్రోల్ అమ్మే పరిస్థితి నెలకొంది. అదే అదు నుగా భావించి కొందరు కిరాణా షాప్ల యజమానులు పెట్రోల్ లీటర్ రూ.150-రూ.170 వరకు విక్రయిస్తు న్నారు. బ్లాక్ మార్కెట్లో భారీ ధరలకు పెట్రోల్ విక్రయి స్తుంటే అధికారులు ఏమి చేస్తున్నారని ప్రయాణికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -