ఫలితాల్లో 95.15 శాతం ఉత్తీర్ణ
తబాలికలు 96.26 శాతం, బాలురు 94.07
సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 99.10 శాతం పాస్
5,731 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత
ములుగు ఫస్ట్…హైదరాబాద్ లాస్ట్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో పదోతరగతి పరీక్షా ఫలితాల్లో 95.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 2.19 శాతం అధిక ఉత్తీర్ణతతో బాలుర కంటే బాలికలుపై చేయి సాధించారు. బాలికలు 96.26 శాతం, బాలురు 94.07 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పాఠశాలల యాజమాన్యాల వారీగా చూస్తే సాంఘిక సంక్షేమ గురుకులాలు 99.10శాతం ఉత్తీర్ణతతో అగ్రగామి గా నిలిచాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 86.18 శాతం నమోదు కాగా ప్రయివేటు పాఠశాలల్లో 95.81 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,731 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదవ్వగా, ఆరు ప్రయివేటు పాఠశాలల్లో 0 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా 99.30 శాతంతో ము లుగు జిల్లా మొదటి స్థానంలో నిలువ గా, అత్యల్పంగా 89.23 శాతంతో హైదరాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌లో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్, ప్రభుత్వ పరీక్షల సంచాలకు లు పి.వి.శ్రీహరి, ఎస్సీఈఆర్టీ సంచాలకులు రమేశ్‌తో కలిసి ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు బుధవారం పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా 5,26,166 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా 4,97,312 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో తెలుగు మీడియంలో 89.14 శాతం, ఇంగ్లీష్ మీడియంలో 95.86 శాతం, ఉర్దూ మీడియంలో 86.71 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
రీ కౌంటింగ్, వెరిఫికేషన్‌కు దరఖాస్తుల స్వీకరణ
రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు నేటి నుంచి మే 14 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. మార్కుల రీ కౌంటింగ్‌కు రూ. 500, రీ వెరిఫికేషన్‌కు ఒక్కో సబ్జెక్ట్‌కు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. కాగా జూన్ 5 నుంచి 12 వరకు పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిం చనున్నారు. కాగా మే14వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించారు. అయితే ఆయా సబ్జెక్ట్ పరీక్షకు రెండు రోజుల ముందు వరకు రూ.50 ఆలస్య రుసుముతో ఫీజును చెల్లించేందుకు అవకాశం ఉంది.
మేనేజ్ మెంట్ వారిగా ఉత్తీర్ణతా శాతం
ప్రభుత్వ పాఠశాలల్లో 86.18 శాతం
జెడ్పీ పాఠశాలల్లో 93.53 శాతం
మోడల్ పాఠశాలల్లో 97.83 శాతం
టీజీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 98.64 శాతం
మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో
98.08 శాతం
సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో
99.1 శాతం
గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో
98.13 శాతం
ఆశ్రమ పాఠశాలల్లో 96.58 శాతం
బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో
98.99 శాతం
ఎయిడెడ్ పాఠశాలల్లో 92.37 శాతం
ప్రయివేటు పాఠశాలల్లో 95.81శాతం
సబ్జెక్ట్ ఉత్తీర్ణత
ప్రథమ భాషలో 99.12 శాతం
ద్వితీయ భాషలో 99.97 శాతం
తృతీయ భాషలో 98.98 శాతం
గణితంలో 97.46శాతం
సామన్యశాస్త్రంలో 98.41 శాతం
సాంఘీక శాస్త్రంలో 99.61 శాతం
‘పదో తరగతి అడ్వాన్స్
సప్లిమెంటరీ పరీక్ష’ షెడ్యూల్
జూన్ 5 – ప్రథమ భాష
జూన్ 6 – ద్వితీయ భాష
జూన్ 7 – తృతీయ భాష
జూన్ 8 – గణితం
జూన్ 9 – సామన్యశాస్త్రం-పార్ట్ 1
జూన్ 10 – సామన్యశాస్త్రం-పార్ట్ 2
జూన్ 11 – సాంఘీక శాస్త్రం
జూన్-12 – ఒఎస్ మెయిన్ లాంగ్వేజ్



