Sunday, May 3, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంటెక్సాస్‌లో కాల్పుల కలకలం..ఇద్దరు మృతి!

టెక్సాస్‌లో కాల్పుల కలకలం..ఇద్దరు మృతి!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : టెక్సాస్‌లోని అమరిల్లో నగరంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో వెస్ట్‌మిన్‌స్టర్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఒక వేడుక రక్తసిక్తమైంది. అపార్ట్‌మెంట్‌లో పార్టీ జరుగుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు లోపలికి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ హింసాత్మక ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానిక నివేదికల ప్రకారం.. డజన్ల కొద్దీ కాల్పులు జరగడంతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండగులు వాడిన ఆయుధాల శబ్దం “మెషిన్ గన్ కాల్పుల”ను తలపించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు విడిచారు. మరికొంతమంది బాధితుల పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కాల్పులకు ముందు మరో చోట జరిగిన చిన్నపాటి ఘర్షణే ఈ దారుణానికి దారితీసినట్లు తెలుస్తోంది. వేరే పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టిన కొందరు మైనర్లు, యువకులు.. కక్షగట్టి అపార్ట్‌మెంట్ వరకు బాధితులను వెంబడించారు. అక్కడ బలవంతంగా లోపలికి ప్రవేశించి తుపాకులతో విరుచుకుపడ్డారని సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -