Monday, May 25, 2026
E-PAPER
Homeక్రైమ్భార్య వేధింపులు..జడ్జి ఆత్మహత్య..!

భార్య వేధింపులు..జడ్జి ఆత్మహత్య..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఢిల్లీలో జిల్లా కోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న అమన్‌ కుమార్‌ శర్మ (30) ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాత్‌రూమ్‌లో ఆయన ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నట్టు పోలీసులు శనివారం వెల్లడించారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారులు వెల్లడించారు. ఆయన భార్య కూడా న్యాయాధికారేనని తెలిసింది. కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య వివాదం నెలకొందని, కోడలి సోదరి అయిన ఐఏఎస్‌ అధికారి జోక్యం చేసుకోవడంతో తన కుమారుడు వేదనకు గురయ్యాడని అమన్‌ తండ్రి వెల్లడించారు. భార్య వేధింపుల వల్లే బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆరోపించారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -