Thursday, May 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబాలల హక్కులను కాలరాస్తే ఉపేక్షించం

బాలల హక్కులను కాలరాస్తే ఉపేక్షించం

- Advertisement -

ఆర్‌బీహెచ్‌పీసీ చైర్‌పర్సన్‌ సీతా దయాకర్‌రెడ్డి ొ ఉమ్మడి మెదక్‌ జిల్లా అధికారులతో సమీక్ష
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి

బాలల హక్కులను కాలరాస్తే ఉపేక్షించబో మని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషనర్‌ చైర్‌పర్సన్‌ సీతా దయాకర్‌ రెడ్డి అన్నారు. మెదక్‌ కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్లో బుధవారం ఉమ్మడి మెదక్‌ జిల్లా అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. బాలకార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, డ్రగ్స్‌ నియంత్రణ, కిషోర బాలికల ఆరోగ్య అవగాహన, విద్య అవగాహన, పాఠశాలల్లో డ్రాప్‌ఔట్‌ తగ్గించడం, మరుగుదొడ్ల నిర్మాణాలు, హాస్టల్లో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు, సాధారణ ప్రసవాలు, పోక్సో కేసుల నమోదు వివరాలు, అతి ప్రమాద మైనర్‌ డ్రైవింగ్‌ అనే అంశాలపై అధికారులనుంచి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీతా దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. బాలలు సురక్షితంగా, ఆరోగ్యంగా, గౌరవప్రదంగా ఎదగడానికి అవసరమైన అన్ని హక్కులనూ కాపాడటం ప్రభుత్వంతో పాటు సమాజం మొత్తం బాధ్యత అని స్పష్టం చేశారు. బాలల హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా, ఎలాంటి ఒత్తిడులు ఉన్నా కమిటీ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. చిన్నారులు సమాజానికి భవిష్యత్‌ బలమైన స్తంభాలు అని, వారి శారీరక, మానసిక, భావోద్వేగ వికాసానికి అనుకూల వాతావరణం కల్పించడం అత్యవసరం అని చెప్పారు. ఇటీవల బాలలపై దౌర్జన్యాలు, బాలకార్మికత్వం, బాల్య వివాహాలు, విద్యా హక్కుల నిర్లక్ష్యం వంటి ఘటనలు జరగడం ఆందోళనకరం అన్నారు.

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ మాట్లాడుతూ.. జిల్లాలో బాలల రక్షణ యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా పనిచేసేలా సూచనలు జారీ చేసినట్టు తెలిపారు. పాఠశాలలు, హాస్టళ్లు, బాలల సంరక్షణ గహాలు వంటి ప్రదేశాల్లో అకస్మాత్‌గా తనిఖీలు నిర్వహిస్తూ, చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నామని వెల్లడించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాలల హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని కోరారు. ఈ సమయంలో బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు వందనా గౌడ్‌, చందన, సరిత, అపర్ణ, అగర్వాల్‌, వచన్‌ కుమార్‌ సిద్దిపేట డీఆర్‌ఓ నాగరాజమ్మ, మెదక్‌ అడిషనల్‌ ఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌, సిద్దిపేట అడిషనల్‌ ఎస్పీ, ఉమ్మడి జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -