Thursday, May 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకేటీఆర్‌ 420

కేటీఆర్‌ 420

- Advertisement -

– పాస్‌పోర్టు నుంచి భూముల కుంభకోణాల వరకు ఆ కుటుంబం పేరు
– సీపీఐ(ఎం)తో జాతీయస్థాయిలో దోస్తీ..కేరళలో కుస్తీ
– రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే తమిళనాడులో విజరుకి మద్దతు : టీపీసీసీ చీఫ్‌ బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌
– 18 కార్పొరేషన్‌ చైర్మెన్ల, 11 కార్పొరేషన్ల వైస్‌ చైర్మెన్ల లిస్టు విడుదల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కేటీఆర్‌ ఓ 420 అనీ, ఆయనది దొంగల బ్యాచ్‌ అని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ తీవ్రస్థాయి లో విమర్శించారు. తమిళనాడులో డీఏంకే తో ఎన్నికలకు వెళ్లినా ఆ రాష్ట్ర పరిస్థితుల నేపథ్యం లోనే టీవీకేకు మద్దతు ఇస్తామని ప్రకటిస్తున్నామని తెలిపారు. జాతీయ స్థాయిలో సీపీఐ(ఎం)తో దోస్తీ కొనసాగుతుందనీ, కేరళం రాష్ట్ర స్థాయిలో ఆ పార్టీతో కుస్తీ ఉంటుందని చెప్పారు. బుధవారం గాంధీ భవన్‌లో 18 మంది కార్పొరేషన్‌ చైర్మెన్ల, 11 కార్పొరేషన్ల వైస్‌ చైర్మెన్ల నియామకానికి సంబంధించిన లిస్టును విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పాస్‌ పోర్ట్‌ కుంభ కోణం మొదలై భూముల కుంభకోణం వరకు కేటీఆర్‌ కుటుంబమే ఉందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో దొంగచాటుగా వచ్చి పార్టీలో చేరి కేకే మహేందర్‌ రెడ్డి గొంతు కోసింది వాస్తవం కాదా కేటీఆర్‌? అని ప్రశ్నించారు. యువత ను మద్యానికి అలవాటు చేసి రాష్ట్ర భవిష్యత్‌ ను బీఆర్‌ఎస్‌ నాశనం చేసిందని విమర్శించారు. ఏం చేసారని ఒకే కుటుంబంలో అంత మందికి పదవులు ఇచ్చారని ప్రశ్నించారు. దళితున్ని సీఎం చేయకుంటే తలనరుక్కు ంటామన్న కేసీఆర్‌కు ఇప్పుడు తల ఉందా? లేదా అని ప్రశ్నించారు.
మాదకద్రవ్యాల ప్రభావం తో కేటీఆర్‌ ఇలా మాట్లాడుతున్నారనే అనుమానం ఉందని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండిసంజరు పిట్టల దొరలా మారాడని విమర్శించారు. కాళేశ్వరంపై సీబీఐకి కేసు అప్పగిస్తే పొడి చేస్తామన్నారు ఏమైంది బండి? అని నిలదీశారు. జాతీయ స్థాయి రాజకీయాలు వేరు.. రాష్ట్ర స్థాయిలో రాజకీయాలు వేరు అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -