Thursday, May 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవరంగల్‌ 'బల్దియా' చివరి కౌన్సిల్‌ సమావేశం

వరంగల్‌ ‘బల్దియా’ చివరి కౌన్సిల్‌ సమావేశం

- Advertisement -

రూ.76.56 కోట్లతో అభివృద్ధి పనులకు ఆమోదం
ఐదేండ్లపాటు సేవలందించడం సంతోషం : మేయర్‌ గుండు సుధారాణి

నవతెలంగాణ-వరంగల్‌
వరంగల్‌ మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో బుధవారం మేయర్‌ గుండు సుధారాణి అధ్యక్షతన చివరి కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. రూ.76.56 కోట్ల అభివృద్ధి పనులకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. గ్రేటర్‌ ప్రజలకు ఐదేండ్లపాటు సేవ చేయడం సంతోషంగా ఉందని మేయర్‌ అన్నారు. చివరి కౌన్సిల్‌ సమావేశం కావడంతో గ్రేటర్‌ పరిధి 11వ డివిజన్‌లో రెండు పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం ఆమె సమావేశానికి హాజరయ్యారు. పార్టీలకతీతంగా పాలకవర్గం సమిష్టిగా పని చేసి అభివృద్ధి సాధించిందన్నారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ప్రాజెక్టుకు పునాది – నగర భవిష్యత్‌కు కీలక అడుగు పడిందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో భారీ నిధులు కేటాయించారని తెలిపారు. ఐదేండ్లలో రూ.3331 కోట్లతో 6676 అభివృద్ధి పనుల్లో సుమారు 60శాతం పనులు పూర్తి అయ్యాయని వివరించారు. మిగిలినవి వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

స్మార్ట్‌ సిటీ ద్వారా రూ.950 కోట్లతో ఆధునిక మౌలిక వసతులు స్మార్ట్‌ రోడ్లు, జంక్షన్లు, చెరువుల సుందరీకరణ, తదితర పనులతో నగరానికి కొత్త రూపు తెచ్చినట్టు చెప్పారు. రోడ్లు, డ్రైన్లు, బ్రిడ్జులు, చెరువుల అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. రూ.25 కోట్ల స్పెషల్‌ ఫండ్‌ రూ.550 కోట్ల యూఐడీఎఫ్‌తో వరద నివారణ చర్యలు చేపట్టామని తెలిపారు. రూ.100 కోట్లతో ఖిలా వరంగల్‌ ఔటర్‌ మోటు అభివృద్ధి- వరద ముప్పు తగ్గించేందుకు కీలక ప్రాజెక్ట్‌ నిర్మాణం కొనసాగుతున్నదన్నారు. దేశ విదేశాల ప్రతినిధులు వరంగల్‌ అభివృద్ధిని ప్రశంసించడం గర్వకారణమన్నారు. ప్రజల విశ్వాసమే మా బలం.. వరంగల్‌ అభివృద్ధే మా లక్ష్యం అని, ఇంకా మెరుగైన నగరంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. వరంగల్‌ నగర అభివృద్ధి కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యం. అధికారంతో మాత్రమే కాకుండా ప్రజల మధ్య ఉండి కూడా ప్రజాసేవ చేయడం సాధ్యమవుతుందని వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య అన్నారు. ప్రతి డివిజన్‌ సమస్యనూ గుర్తించి సమన్వయంతో పరిష్కరించాలన్నారు.

హైదరాబాద్‌ తరువాత వరంగల్‌ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని, ముఖ్యంగా పారిశుధ్యం, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, హనుమకొండ జిల్లా కలెక్టర్‌, ఇన్‌చార్జి కమిషనర్‌ చాహాత్‌ బాజ్‌పాయి, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొ న్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -