Saturday, May 16, 2026
E-PAPER
Homeకరీంనగర్ఇంటర్‌లో ప్రతిభ కనబర్చిన విద్యార్థినికి నగదు ప్రోత్సాహకం

ఇంటర్‌లో ప్రతిభ కనబర్చిన విద్యార్థినికి నగదు ప్రోత్సాహకం

- Advertisement -

-రాష్ట్ర స్థాయిలో మెరిసిన రాయికల్ కేజీబీవీ విద్యార్థిని 
నవతెలంగాణ-రాయికల్

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో శనివారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్-2026 ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో సి.ఇ.సి గ్రూపులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జగిత్యాల జిల్లా రాయికల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థిని ఎన్. నందినిని ఘనంగా సన్మానించారు.

ఇంటర్ పరీక్షల్లో 1000 మార్కులకు గాను 978 మార్కులు సాధించిన నందినిని ప్రభుత్వ సలహాదారు (ప్రజా సంబంధాలు,విద్య)కె. కేశవరావు, విద్యాశాఖ సంచాలకులు డాక్టర్ యోగితా రాణా,సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఎ.దేవసేన అభినందించి రూ.25 వేల నగదు చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కమిషనర్ ఈ.నవీన్ నికోలస్,సర్వ శిక్ష అభియాన్ రాష్ట్ర కో ఆర్డినేటర్ జి. శిరీష తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -