Saturday, May 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫెర్టిలైజర్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక

ఫెర్టిలైజర్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ-కాటారం 
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన జిల్లా కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని టీపీఆర్ ఫంక్షన్ హాలులో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నాగూర్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. జిల్లా గౌరవ అధ్యక్షులుగా యాంసాని వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులుగా కట్కం అశోక్, ఉపాధ్యక్షులుగా నలిగేటి సతీష్, ప్రధాన కార్యదర్శిగా పుప్పాల రాజు, కోశాధికారిగా కందునూరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. గౌరవ సలహాదారులుగా తొగరి శ్రీనివాస్, తడకల జగదీష్, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఒల్లాల రాంబాబు, కార్యదర్శిగా లింగంపల్లి తిరుపతి, సహాయ కార్యదర్శిగా లింగంపల్లి బాబురావులను నియమించారు. అదనంగా మరో 22 మందిని కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నాగూర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో ఫెర్టిలైజర్స్ డీలర్ల సమస్యల పరిష్కారానికి కమిటీ సమష్టిగా కృషి చేయాలని సూచించారు. డీలర్ల హక్కుల పరిరక్షణతో పాటు అసోసియేషన్ బలోపేతానికి ముందుండి పనిచేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, డీలర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -