Sunday, May 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబాబాగా మారాలని జననాంగం నరుక్కుని బావిలో విసిరేసిన రైతు

బాబాగా మారాలని జననాంగం నరుక్కుని బావిలో విసిరేసిన రైతు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్‌ జిల్లాలో జరిగిన ఓ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒక రైతు (42) గొడ్డలితో తన జననాంగం నరుక్కుని బావిలో విసిరేశాడు. మహారాజ్‌పుర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. కుటుంబ బాధ్యతల నుంచి.. పాపభీతి నుంచి విముక్తి పొంది, బాబాగా మారాలని అతడు నిర్ణయించుకున్నాడు. పాపభరితంగా తాను భావిస్తున్న శరీరంలోని ఆ నిర్దిష్ట భాగాన్ని తొలగించుకునేందుకు పొలంలోని బావి వద్దకు చేరుకుని ఈ చర్యకు పాల్పడ్డాడు. అనంతరం కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. రక్తస్రావంతో పడున్న రైతును కుటుంబ సభ్యులు ఛతర్‌పుర్‌ జిల్లా ఆస్ప‌త్రికి తరలించారు. ఇతడికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె వివాహం జూన్‌ 25న జరగాల్సి ఉంది. భార్య చాలాకాలంగా పక్షవాతంతో బాధపడుతోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. ఈ పరిస్థితుల కారణంగా అతడు కొద్దిరోజులుగా తీవ్రమైన మానసిక వేదనతో సతమతమవుతున్నాడు. రక్తస్రావం తీవ్రంగా జరిగిందని, చికిత్స కొనసాగిస్తున్నట్లు డాక్టర్‌ మనోజ్‌ చౌధరి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -