- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : విశాఖ నగరంలోని గాజువాక సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్న బస్సు శ్రీనగర్ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



