- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భారతీయ వైమానిక రక్షణ సామర్థ్యం మరింత మెరుగుపడింది. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ వ్యవస్థకు చెందిన నాలుగో స్క్వాడ్రన్ భారత్‌కు చేరుకుంది. ఈ క్షిపణి వ్యవస్థలో క్షిపణులు, లాంచర్లు, సెన్సార్లు, రేడార్లు ఉంటాయి. 2018లో రష్యాతో 5.4 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. గత ఏడాది ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్రూయిజ్ మిస్సైళ్లను ఎస్-400 సమర్థవంతంగా ఎదుర్కొంది.
- Advertisement -



