Thursday, June 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మూడు రోజులు నిల్వ ఉన్న నీటిని త్రాగవద్దు 

మూడు రోజులు నిల్వ ఉన్న నీటిని త్రాగవద్దు 

- Advertisement -

15 రోజులకు ఒకసారి వాటర్ ట్యాంకులు శుభ్రం చేయాలి: ఆర్ డబ్ల్యూ స్ డీఈ హేమలత
నవతెలంగాణ-అచ్చంపేట
ప్రజలకు త్రాగునీటి అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని సరఫరా చేయడం జరుగుతుంది. మూడు రోజులు కంటే ఎక్కువ నిలువ ఉన్న నీటిని త్రాగవద్దని ఆర్డబ్ల్యూఎస్ డీఈ హేమలత గ్రామస్తులకు సూచించారు. గురువారం అచ్చంపేట మండలంలోని మన్నె వారి పల్లి గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ సబావత్  సునీత ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. త్రాగునీటికి ఉన్న ప్రాధాన్యత గురించి గ్రామస్తులకు వివరించారు.

15 రోజులకు ఒకసారి కచ్చితంగా వాటర్ ట్యాంకులను శుభ్రం చేయాలి. ట్యాంక్ లను శుభ్రం చేస్తున్నట్లు ఫోటోలు, వీడియోలు తీసి తనకు వాట్సాప్ ద్వారా పంపించాలన్నారు. వాటర్ ట్యాంకులకు ఫైల్ అమ్ముతాను లేకపోవడం వల్ల కోతులు త్రాగుతున్నాయని జలకాలు ఆడుతున్నాయని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మిషన్ భగీరథ నీరు సక్రమంగా రావడం లేదని వారంలో రెండు రోజులు మాత్రమే వస్తున్నాయని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు ప్రజలు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -