నవతెలంగాణ-వనపర్తి
గోపాల్పేట్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుండ్రాతి రాజేష్ గౌడ్ తల్లి పద్మమ్మ మృతి చెందిన విషయం తెలుసుకుని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గోపాల్పేట్ మండల కేంద్రంలోని 13వ వార్డుకు చెందిన పసుపుల పెద్ద వెంకన్న తల్లి నాగమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేడు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెబుతూ ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. నిరంజన్ రెడ్డి వెంట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలరాజ్, కో-ఆప్షన్ సభ్యులు మతిన్, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, మన్యం నాయక్, గాజుల శీను, వల్లపు మూర్తి, శివ, వెంకటేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



