నవతెలంగాణ – జుక్కల్
బస్వాపూర్ గ్రామపంచాయతీలో బుధవారం స్వచ్చ భారత్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ గ్రామసభకు మండల పంచాయతీ అధికారి రాము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామ ప్రజల సహకారంతో స్వచ్ఛ బస్వాపూర్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనమందరం తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా సర్పంచ్ వి. రమణ సురేష్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలందరూ తమ తమ ఇండ్ల చుట్టూ ప్రక్కల తమ తమ వాకిట్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తమ ఇండ్లలో వంట చేసిన తర్వాత వంట పాత్రలపై శుభ్రంగా ఉన్న బట్టను కప్పుకోవాలని, నీటి తొట్టెలో కానీ డ్రమ్స్ లలో నీళ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా వాటిని శుభ్రపరచుకోవాలని అన్నారు. ప్రతి ఒక్క ఇంటి వాకిట్లో ఇంటి స్థలాలలో మొక్కలు నాటుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో ఏ వార్డులైనా సరే ఏదైనా సమస్య ఉన్నచో తమ దృష్టికి తెస్తే పరిష్కారానికి కృషి చేస్తామని, పరిష్కారం కానీ సమస్యలు ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సహకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ, అగ్రికల్చర్ ఏఈఓ, ఉపాధి హామీ సీఈఓ, జిపి కార్యదర్శి, వార్డ్ సభ్యులు, అంగన్వాడి, ఆశా, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ చిన్న పెద్దలు తదితరులు పాల్గొన్నారు.



