Friday, June 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపాలమూరు గడ్డపై ఇకమీదట బీఆర్ఎస్ జెండా ఎగురనివ్వం: సీఎం రేవంత్ రెడ్డి

పాలమూరు గడ్డపై ఇకమీదట బీఆర్ఎస్ జెండా ఎగురనివ్వం: సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పాలమూరు జిల్లాను గత ప్రభుత్వం బీఆర్ఎస్ పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుతం ఆయన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రాజెక్టులను బీఆర్‌ఎస్‌ నేతలు పట్టించుకోలేదని అన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.22వేల కోట్లలో రూ.8వేల కోట్లు పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులకే ఖర్చు చేశామని తెలిపారు. జిల్లాకు ఇంజినీరింగ్‌, మెడికల్‌ కాలేజీలు తెచ్చుకున్నామని చెప్పారు.

200 ఎకరాల్లో ఎడ్యుకేషన్‌ క్యాంపస్‌ ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. వలసలు ఆగాలంటే పాలమూరు జిల్లా సస్యశ్యామలం కావాలని అభిప్రాయపడ్డారు. రెండు పడకగదుల ఇళ్లు కట్టిన చోటే బీఆర్‌ఎస్‌ నేతలు ఓట్లడగాలని, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన చోటే నేను ఓట్లడుగుతానని శపథం చేశారు. కాంగ్రెస్‌ 30 నెలల పాలన.. చెబితే రామాయణం, రాస్తే భారతం అవుతుందన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలన.. నా 30 నెలల పాలనపై ఆ పార్టీ నేతలు చర్చకు సిద్ధమా.. అని ప్రశ్నించారు. కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే ఇరువురి పాలనపై చర్చిద్దామని, ఆ చర్చలో ఓడితే నేను క్షమాపణ చెబుతానని అన్నారు. ఇకమీదట పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్‌ జెండా ఎగురనివ్వమని సవాల్ చేశారు. బీఆర్ఎస్ గద్దె దిగాలి.. దిమ్మెలు కూలాలన్నారు. పాలమూరు గడ్డపై ఆ పార్టీ నుంచి భవిష్యత్తులో ఒక్కరినీ గెలవనివ్వమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -