Saturday, June 6, 2026
E-PAPER
Homeఆటలుముగిసిన పోరాటం

ముగిసిన పోరాటం

- Advertisement -

క్వార్టర్స్‌లో అర్జున్ జోడీ ఓటమి
ఇండోనేషియా ఓపెన్‌

జకర్తా (ఇండోనేషియా) : ప్రపంచ టూర్‌ ‌ఫైనల్స్‌‌లో భారత షట్లర్ల టైటిల్‌ ‌నిరీక్ష‍ణకు తెరదించుతూ సాత్విక్‌,చిరాగ్‌ ‌జోడీ సింగపూర్‌ ఓపెన్‌‌లో చాంపియన్‌‌గా నిలువటంతో భారత బ్యాడ్మింటన్‌‌కు మళ్లీ జోష్‌ వచ్చింది. కానీ వారం రోజుల్లోనే మళ్లీ కథ మొదటికొచ్చింది. గాయంతో సాత్విక్‌,చిరాగ్‌‌లు తొలి రౌండ్లోనే వాకోవర్‌ ఇవ్వగా.. పి.వి సింధు, ఆయుష్‌ ‌శెట్టి రెండో రౌండ్‌ ‌వరకే పోరాడారు. పురుషుల డబుల్స్‌లో క్వార్టర్‌‌ఫైనల్‌‌కు చేరుకున్న హరిహరణ్‌, ఎంఆర్‌ అర్జున్‌ ‌జోడీ సైతం ఇంటి బాట పట్టడంతో ఇండోనేషియా ఓపెన్‌ ‌సూపర్‌ 1000 ‌టోర్నమెంట్‌‌లో భారత పోరాటానికి తెరపడింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌‌ఫైనల్లో అర్జున్‌, హరిహరణ్‌‌లు వరల్డ్‌ ‌నం.8 మలేషియా షట్లర్ల చేతిలో ఓటమి చెందారు. 32 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్‌‌లో 12-21, 10-21తో అర్జున్‌, హరిహరణ్‌‌లు నిరాశపరిచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -