Saturday, June 6, 2026
E-PAPER
Homeఆటలుమార్పులు, చేర్పులు ఉండేనా?

మార్పులు, చేర్పులు ఉండేనా?

- Advertisement -

నేడు సీనియర్‌ సెలక్ష‍న్‌ కమిటీ భేటీ
ముంబయి : 15 ఏండ్ల చిన్నోడు వైభవ్ సూర్యంశీ, 35 ఏండ్ల వెటరన్‌ ‌సూర్యకుమార్‌ ‌యాదవ్‌ ‌సహా శ్రేయస్‌ అయ్యర్‌, రజత్‌ ‌పటిదార్‌ ‌భవితవ్యం నేడు తేలనుంది. ఐర్లాండ్‌‌తో రెండు టీ20లు, ఇంగ్లాండ్‌‌తో ఐదు టీ20లు సహా ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత టీ20 జట్టును నేడు ఎంపిక చేయనున్నారు. చీఫ్‌ ‌సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ‌సారథ్యంలోని సెలక్ష‍న్‌ ‌కమిటీ నేడు ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమావేశం కానుంది. లాస్‌ఏంజిలెస్‌ ఒలింపిక్స్‌, దక్ష‍ిణాఫ్రికాలో టీ20 ప్రపంచకప్‌ ‌ప్రణాళికల్లో సూర్యకుమార్‌ ‌యాదవ్‌ ఉన్నాడా? లేదా అనేది నేడు తేలనుంది. బ్యాటర్‌‌గా విఫలమవుతున్న సూర్యకుమార్‌ కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. కానీ టీ20 ప్రపంచకప్‌ ‌విజయం అందించిన కెప్టెన్‌‌కు మెరుగైన వీడ్కోలు అందించాలనే ఆలోచన సైతం కనిపిస్తోంది. ఐపీఎల్‌లో ప్రకంపనలు సృష్టించిన వైభవ్‌ ‌సూర్యవంశీ జాతీయ జట్టు తరఫున విధ్వంసక ఇన్నింగ్స్‌‌లు ఆడేందుకు ఎదురుచూస్తుండగా.. శ్రేయస్‌ అయ్యర్‌ ‌జట్టులో చోటుతో పాటు నాయకత్వ పగ్గాలు ఆశిస్తున్నాడు. శ్రీలంకలో జరిగే భారత్‌-ఏ రెండు మ్యాచ్‌‌లు నాలుగు రోజుల ఫార్మాట్‌‌కు సైతం జట్టును నేడు ఎంపిక చేయనున్నారు. సెప్టెంబర్‌‌లో స్వదేశంలో వెస్టిండీస్‌‌తో టీ20 సిరీస్‌‌ను గమనంలో ఉంచుకుని ఆసియా క్రీడలకు భారత జట్టును ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. ఆసియా క్రీడలకు వెళ్లే భారత జట్టు కెప్టెన్‌గా తిలక్‌ ‌వర్మ ఎంపికయ్యే సూచనలు ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -