Saturday, June 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక గ్రామసభలు

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక గ్రామసభలు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని 30 గ్రామపంచాయతీ గ్రామాలలోని రెండవ రోజు ప్రజాపాలన ప్రగతి – ప్రణాళిక  99 రోజులకు ప్రత్యేక గ్రామసభలు శనివారం గ్రామాల సర్పంచుల అధ్యక్షతన ఏడు గ్రామాలలో నిర్వహించారు. గ్రామసభలలో పెద్దగుల్ల గ్రామ సర్పంచ్ మాధవరావు దేశాయ్, చిన్నగుల్ల సర్పంచ్ జ్ఞానేశ్వర్, గుల్ల తాండ సర్పంచ్ సుమతి రాథోడ్ యశ్పాల్, గుండూరు సర్పంచ్ కాశీనాథ్, హంగర్గా గ్రామ సర్పంచ్ కుమ్మరి నర్సింలు, జుక్కల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కర్రే వార్ సావిత్ర సాయ గౌడ్, ఖండేబల్లూర్ గ్రామ సర్పంచ్ చాకలి కృష్ణ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ రాము హాజరై, గ్రామస్థులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాబోవు వర్షాకాలంలో ముందస్తుగా తీసుకోవలసిన జాగ్రత్తలు, మురికి కాలువల బూడిద పిచ్చి మొక్కలు తొలగింపు, సానిటేషన్, మంచినీటి నిర్వహణ గురించి ఈ సభలో చర్చించారు. అంతే కాకుండా లు తీర్మాణాలు చేశారు. అనంతరం ఆయా గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ.. గ్రామాలలో మౌలిక వసతులు కల్పించడం ప్రధాన లక్ష్యమని, గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, ఆయా గ్రామాల్లో  జిపి కార్యదర్శిలు , జిపిఓ లు , గ్రామ పెద్దలు , యువకులు , మహిళా సంఘాల సభ్యులు , ఇందిరా గృహ కమిటీ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు , ఉపాధి హామీ అధికారులు,  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -