Sunday, June 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుడి కుటుంబానికి పరామర్శ 

మృతుడి కుటుంబానికి పరామర్శ 

- Advertisement -

డిసిసి జిల్లా ఉపాధ్యక్షుడు బాలాజీ నాయక్ 
నవతెలంగాణ-నెల్లికుదురు

మండలంలోని బోటి మీది తండా గ్రామపంచాయతీ పరిధిలోని బానోతు మోహన్ మృతి చెందగా.. ఆయన కుటుంబాన్ని డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు బాలాజీ నాయక్ ఆదివారం పరామర్శించారు. అదేవిధంగా మృతుడి చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోటి మీది తండా  గ్రామపంచాయతీ వార్డు నెంబర్ బానోతు అఖిల రాజు  తండ్రి అయినా కీర్తిశేషులు బానోతు మోహన్ మరణించడం ఎంతో బాధాకరమని అన్నారు. ఈ తండా అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేశారని అన్నారు. మృతి చెందిన కుటుంబానికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని కోరినట్లు చెప్పారు. ఆ కుటుంబాన్ని ఆదుకున్నందుకు ధనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బోటీ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ జాటోత్ రామ్ సింగ్ నాయక్ , ఉప సర్పంచ్  గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోత్ వీరన్న, వాంకుడో బిచ్చా నాయక్, జాటోత్ లక్ పత్తి, బాలు నాయక్ ,కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అసెంబ్లీ ఇన్చార్జ్ తవిశెట్టి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -