డిసిసి జిల్లా ఉపాధ్యక్షుడు బాలాజీ నాయక్
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని బోటి మీది తండా గ్రామపంచాయతీ పరిధిలోని బానోతు మోహన్ మృతి చెందగా.. ఆయన కుటుంబాన్ని డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు బాలాజీ నాయక్ ఆదివారం పరామర్శించారు. అదేవిధంగా మృతుడి చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోటి మీది తండా గ్రామపంచాయతీ వార్డు నెంబర్ బానోతు అఖిల రాజు తండ్రి అయినా కీర్తిశేషులు బానోతు మోహన్ మరణించడం ఎంతో బాధాకరమని అన్నారు. ఈ తండా అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేశారని అన్నారు. మృతి చెందిన కుటుంబానికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని కోరినట్లు చెప్పారు. ఆ కుటుంబాన్ని ఆదుకున్నందుకు ధనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బోటీ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ జాటోత్ రామ్ సింగ్ నాయక్ , ఉప సర్పంచ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోత్ వీరన్న, వాంకుడో బిచ్చా నాయక్, జాటోత్ లక్ పత్తి, బాలు నాయక్ ,కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అసెంబ్లీ ఇన్చార్జ్ తవిశెట్టి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
మృతుడి కుటుంబానికి పరామర్శ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



