- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కట్టాలి తాండ ఎంపిపీఎస్ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను, నోటు పుస్తకాలు గ్రామ పెద్దల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగిందని ప్రదాన ఉపాధ్యాయురాలు మౌనిక తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ మండల విద్యాశాఖ ఆదేశాలతో పాఠశాలలు ప్రారంభం రోజే పంపిణీ చేయడం విద్యార్థుల తల్లిదండ్రులకు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి అంచలంచెలుగా ఎదుగుతూ గ్రామానికి మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, హెచ్ ఎం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



