భైంసా ఏఎస్పీ సాయికిరణ్
నవతెలంగాణ-కుభీర్
నేరాలను నియంత్రించేందుకే కార్డెన్ సర్చ్ వంటి ప్రోగ్రాములు ఏర్పాటు చేయడం జరుగుతుందని భైంసా ఏఎస్పీ సాయికిరణ్ అన్నారు. సోమవారం కుభీర్ మండలంలోని చాత గ్రామంలో నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు ఈ కార్యక్రం చేపట్టామని ఆయన తెలిపారు. ఉదయం గ్రామంలో పోలీస్ బృందాలుగా విడిపోయి గ్రామంలో ఇంటింటికి సోదాలు నిర్వహించి, ద్విచక్ర వాహనాలు, ఆటోలు స్వాధీన పరుచుకున్నారు. ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటుచేసిన సమావేశంలో ఏ ఎస్పీ సాయికిరణ్ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణలో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. ఇటీవల సైబర్ నేరాల వల్ల అనేకమంది నష్టపోతున్నారని దీంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అదేవిధంగా మత్తు పానీయాలు, మద్యం సేవించి వాహనాలు నడపడం మైనర్ల వాహనాలు నడపడం, హెల్మెట్ వంటి వాటిపై గ్రామస్తులకు వివరించారు. గ్రామంలో వాహనాలకు ఎలాంటి పత్రాలు లేకుండా ఉన్న ద్విచక్ర వాహనాలు 92 ఒక ఆటో స్వాధీనం చేసుకొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జాజుల దేవేందర్,బైంసా రూరల్ సి ఐ ప్రవీణ్ కుమార్ కుభీర్ ఎస్ ఐ కృష్ణ రెడ్డి కుంటాల బైంసా రూరల్ ఎస్ ఐ లు పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
నేరాలను నియంత్రించేందుకే కార్డన్ సర్చ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



