నవతెలంగాణ -పెద్దవంగర
మండల కేంద్రంలోని ఎక్స్ రోడ్డు ప్రాథమిక పాఠశాలలో మంగళవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంఈవో బుధారపు శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ ముద్దసాని పారిజాత, ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ చిన్నారులకు విద్యారంభం చేయిస్తూ అక్షరాలను దిద్దించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు విద్యే పునాది అని పేర్కొన్నారు. అనంతరం ఇన్ఫోసిస్ ఆధ్వర్యంలో పాఠశాలకు బహుకరించిన కంప్యూటర్ ను సర్పంచ్ ప్రారంభించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. విద్యార్థులు ఉత్సాహంగా అక్షరాభ్యాసం లో పాల్గొనగా, పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. ఈ సందర్భంగా విద్య ప్రాముఖ్యత పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఏపీసీ చైర్మన్ ఈదురు రమ, ఉపాధ్యాయులు సౌభాగ్య, వార్డు సభ్యులు రాంపాక రమ నారాయణ, యాకలవ్య మల్లేష్, సీఆర్పీ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



