Tuesday, June 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచర్ల ఓసిపిలో కేంద్ర పర్యావరణ శాఖ అధికారి తనిఖీ

తాడిచర్ల ఓసిపిలో కేంద్ర పర్యావరణ శాఖ అధికారి తనిఖీ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్ల-1 ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనిని కేంద్ర పర్యావరణ, శీతోష్ణస్థితి మార్పుల మంత్రిత్వ శాఖ ప్రాంతీయ అధికారి డాక్టర్ ఎం.టి. కరప్పాయ్ రెండు రోజుల పాటు క్షుణ్ణంగా పరిశీలించారు. గనిలో పర్యావరణ అనుమతి నిబంధనల అమలు, గాలి, నీటి నాణ్యత, దుమ్ము నియంత్రణ, హరితహారం మరియు వ్యర్థాల నిర్వహణ చర్యలను ఆయన తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా గని యాజమాన్యం పునరావాస కార్యక్రమాలు, భూసార పరిరక్షణ, సామాజిక బాధ్యత పనుల వివరాలను అధికారికి సమర్పించింది. వివిధ ప్రాంతాలను సందర్శించిన అనంతరం ఆయన తన నివేదికను కేంద్ర మంత్రిత్వ శాఖకు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీ జెన్‌కో జనరల్ మేనేజర్ పి. మోహన్ రావు గారు, ఈఈ సివిల్ తౌఫీల్ అహ్మద్ మరియు గని యాజమాన్యం నుండి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టి. శ్రీధర్, ప్రాజెక్ట్ హెడ్ ఎ. ప్రభాకర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కే ఎస్ ఎన్ మూర్తి, మైన్ మేనేజర్ జి శ్రీనివాస్, సేఫ్టీ ఆఫీసర్ కే సురేష్ బాబు, ఎస్టేట్ ఆఫీసర్ రామచంద్ర మూర్తి, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ రామ్ కుమార్ & అభిషేక్, సర్వే డి.జి.యం ఎమ్ సర్వోత్తమ్ & శేషావతారం, ప్రాజెక్ట్ ఇంజనీర్ కే. కిషన్, హెచ్ ఆర్ డి.జి.యం రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -